ఆటో, బైక్‌ ఢీకొని 12 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-03-18T11:22:19+05:30 IST

ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని 12 మందికి గాయాలైన సంఘటన మంగళవారం విజ్ఞాన భారతి సమీపంలోని నాలుగు రోడ్ల

ఆటో, బైక్‌ ఢీకొని 12 మందికి  గాయాలు

చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్‌


చీరాల టౌన్‌, మార్చి 17: ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని 12 మందికి గాయాలైన సంఘటన మంగళవారం విజ్ఞాన భారతి సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో జరి గింది. అవుట్‌పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాల తెల్లగాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన  8 మంది పే రాలలోని శి వాలయంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం తిరిగి ఆటో లో బయలుదేరారు. పట్టణ పరిధిలోని విజ్ఞానభారతి సమీ పంలోగల నాలుగు రోడ్ల కూడలి వద్ద వేగంగా వస్తున్న ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి.


ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న గోలి నారాయణ మ్మ, అక్కల యశోద, నాగమల్లేశ్వరి, లక్ష్మీనారాయణ. భాస్క ర్‌రావు, నాగరాజకుమారి, సుబ్బారావు, కుమద్వితిలకు గా యాలయ్యాయి. ఆసమయంలో నడుచుకుంటూ వెళ్తున్న  థామస్‌పే టకు చెందిన బడుగు పవిత్ర, జ్యోత్స్నలను ఆటో ఢీనడంతో వారు కూడా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై వస్తున్న పాపరోజుతోటకు చెందిన గ్రంధి నవీన్‌కుమార్‌, ఉమేష్‌కు గా యాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ ప్రమాదం నుం చి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితులను చీరా ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల వన్‌టౌన్‌ పోలీసులు డ్రైవర్‌ను అ దుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2020-03-18T11:22:19+05:30 IST