టీటీడీకి 108 గోవుల విరాళం
ABN , First Publish Date - 2020-12-14T04:33:50+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు తనవంతు సహకారంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 108 గోవులను విరాళంగా ప్రకటించారు.

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రకటన
దర్శి, డిసెంబరు 13 : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు తనవంతు సహకారంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 108 గోవులను విరాళంగా ప్రకటించారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన ‘గుడికో గోమాత’ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డితో పాటు ఎమ్మెల్యే వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమానికి తనవంతుగా 108 గోవులను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వేణుగోపాల్ ప్రకటించారు. వెంకటేశ్వరస్వామి వారి సేవలో పాల్గొనే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాల్‌ను టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు.