నిలువ నీడ లేని సంజీవని

ABN , First Publish Date - 2020-07-18T11:11:35+05:30 IST

108, 104 సేవలను విస్తృతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలో ప్రతి మండలానికి ఒక్కో వాహనం చొప్పున కేటా ..

నిలువ నీడ లేని సంజీవని

 ఎండలోనే వాహనాలు

ఏళ్లతరబడి ఇదే పరిస్థితి


అద్దంకి, జూలై 17: 108, 104 సేవలను విస్తృతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలో ప్రతి మండలానికి ఒక్కో వాహనం చొప్పున కేటా యించింది. అయితే, గత 14 సంవత్సరాలుగా కనీస వసతులు లేకుం డానే 108 సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ప్రతి మండలానికి కేటాయించినా సిబ్బంది వసతులు కల్పన గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక ఏళ్ల తరబడి వాహనాలు సైతం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2007లో 108 సేవలను ప్రారంభించారు. మన జిల్లాలో గతం లో 108 వాహనాలు 32 ఉండగా, ప్రస్తుతం అన్ని మండలాలకు కేటాయిం చా రు. సిబ్బందికి మాత్రం వసతులు కల్పించడంలేదు. అద్దంకి లో గత 14 ఏళ్లుగా శిథిలమైన పాడుబడ్డ పాత వైద్యశాల లోని చిన్న గదిలో సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్నారు. చినుకు పడితే కనీసం కూర్చునే వీలులేకుండా ఉంది. ఇప్పు డు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతాలలో కూడా వసతులు లేమి ఉంది. 


ఇంకా ప్రారంభం కాని 104 సేవలు

మండలానికి ఒకటి చొప్పున 104 వాహనాన్ని కేటాయించినా, ఇంకా సేవలు ప్రారంభం కాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవటంతో వైద్యశాలలకే పరిమితం అయ్యాయి.  ఈ వాహనాలకు కూడా ఆయా కేంద్రాలలో పార్కింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా షెడ్‌లు ఏర్పాటుచేస్తే మరింత ఎక్కువ కాలం వినియో గించుకునే వీలు ఉంటుందని పలువురు అభి ప్రాయపడుతున్నారు.


వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం..హరిబాబు, 108 సిబ్బంది, అద్దంకి

108 సేవలు 14 సంవత్సరాల క్రితం ప్రారంభమైనా చాలాచోట్ల  వసతులు కల్పించలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ఆయా ఆసుపత్రులలో 108 సిబ్బంది విశ్రాంతికి, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ లు దాచుకునేందుకు ప్రత్యేకంగా ఒక గది కేటాయిస్తే బాగుంటుంది. 

Updated Date - 2020-07-18T11:11:35+05:30 IST