జోరుగా జీరో వ్యాపారం

ABN , First Publish Date - 2020-12-21T04:33:19+05:30 IST

గత శుక్రవారం రాత్రి నెల్లూరులో పోలీసులు,సెబ్‌ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ బంగారు వ్యాపారి నుంచి రూ.60 లక్షలు విలువ చేసే 1,025 గ్రాముల బంగారం, 5.520 కేజీల వెండితోపాటు రూ.6.53 లక్షల నగదును పట్టుకున్నారు.

జోరుగా జీరో వ్యాపారం

 చెన్నై నుంచి నిత్యం కేజీల కొద్దీ బంగారం దిగుమతి

నెల్లూరు, కావలి కేంద్రాలుగా రూ.కోట్లలో వ్యాపారం

ఎవరికీ అనుమానంగా రాకుండా రైళ్లు, బస్సుల్లో ప్రయాణం

వరుసగా పట్టుకుంటున్న డీఆర్‌ఐ, రైల్వే పోలీసులు

ప్రభుత్వ ఆదాయానికి గండి

నిఘా పెడితే పలు విషయాలు వెలుగులోకి..!


నెల్లూరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : గత శుక్రవారం రాత్రి నెల్లూరులో పోలీసులు,సెబ్‌ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ బంగారు వ్యాపారి నుంచి రూ.60 లక్షలు విలువ చేసే 1,025 గ్రాముల బంగారం, 5.520 కేజీల వెండితోపాటు రూ.6.53 లక్షల నగదును పట్టుకున్నారు. విచారించగా అదంతా దొంగ బంగారమని, సదరు వ్యాపారి జీరో బిజినెస్‌ చేస్తున్నట్లు గుర్తించారు. 

ఈ ఏడాది మార్చి 10న ముగ్గురు వ్యక్తులు చెన్నై నుం చి 5.50 కేజీల బంగారాన్ని ఓ బస్సులో తీసుకెళ్తున్నారు. ఇంత బంగారాన్ని సాదాసీదాగా బస్సులో తరలిస్తున్నారన్న సమాచా రం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారుల కు అందింది. దీంతో వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద మాటు వే సిన అధికారులు వేకువ జామున బస్సును ఆపి ఆ ముగ్గురిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బంగారానికి ఎలాం టి బిల్లులు లేవని గుర్తించారు. దీన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకొని బంగారాన్ని సీజ్‌ చేశారు. 

గతేడాది ఓ వ్యక్తి చెన్నై నుంచి సుమారు మూడు కేజీల బంగారాన్ని బిల్లులు లేకుండా కొనుక్కొని కావలికి తీసుకువ చ్చాడు. సమాచారం తెలుసుకున్న డీఆర్‌ఐ అధికారులు మా టు వేసి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అంతకుముందు ఓ కారులో సుమారు పది కేజీల బంగారాన్ని  బిల్లులు లేకుండా కొందరు తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు.

ఇవే కాదు.. గతంలో ఓ వ్యక్తి ఒంగోలు నుంచి రూ.67.5 లక్షలతో జనరల్‌ రైలు బోగీలో దొంగ బంగారం కొనేందుకు వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అలానే పడుగుపాడు వద్ద ఓ వ్యక్తి నుంచి రూ.86 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గూడూరులో మరో మహిళ వద్ద రూ.50 లక్షలు పట్టుకు న్నారు... ఇవన్నీ జీరో బంగారం వ్యాపారం కోసమేనని  విచార ణలో తేలింది. సమాచారమందిన పలు సందర్భాల్లో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు జరిపి లెక్కలు లేని బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. ఈ సంఘటనలన్నీ జిల్లాలో బంగారం జీరో బిజినెస్‌ ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టం చేస్తున్నాయి. కరోనా కారణంగా కొంతకాలం నుంచి ఆగిన జీరో బిజినెస్‌ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. 


చెన్నై నుంచి నెల్లూరుకు..


జిల్లాలోని వ్యాపారులంతా చెన్నై నుంచే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇందులో బిల్లుల ద్వారా ఎంత బంగారం దిగుమతి అవుతుందో.. బిల్లులు లేకుండా కూడా అంతే బంగారం దిగుమతి అవుతుంది. బంగారం పుష్కలంగా లభ్యమయ్యే కువైట్‌ వంటి దేశాల నుంచి చెన్నైకు విమానాల ద్వారా  స్మగ్లింగ్‌ జరుగుతుంటుంది. కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ వ్యాపారాన్ని చేస్తుంటారు. అక్కడి నుంచి జిల్లాకు ఈ స్మగ్లింగ్‌ బంగారం దిగుమతి అవుతోంది. నెల్లూరు, కావలి కేంద్రాల్లోని వ్యాపారులు అత్యాశకు పోయి బిల్లులు లేని ఈ దొంగ బంగారాన్ని తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు చేస్తుంటారు. కేజీ బంగారాన్ని బిల్లులు లేకుండా కొనుగోలు చేసి తీసుకొచ్చుకుంటే సుమారు రూ.3 లక్షల వరకు మిగులుతుందని సమాచారం. ఒక వ్యాపారి ఓసారి చెన్నై నుంచి బంగారాన్ని తెచ్చుకుంటున్నారంటే కనీసం కేజీకి తగ్గకుండా తెచ్చుకుంటారని తెలుస్తోంది. కొంత మంది బడా వ్యాపారులు ఒకేసారికి రూ.2 కోట్లకుపైన సరుకును కొనుగోలు చేస్తారని సమాచారం. ఇలా బిల్లులు లేకుండా జీరో దందా మూలంగా ప్రభుత్వానికి ఏటా రూ.కోట్ల లో ఆదాయానికి గండిపడుతోంది. ఈ దందా ఎక్కువుగా రైళ్లు, బస్సుల్లో రాకపోకల ద్వారా సాగుతోంది. 


సీజన్‌ బాయ్స్‌ ద్వారా కొనుగోలు


ఇలా జీరో వ్యాపారంతో తీసుకొచ్చిన బంగారాన్ని ఆభరణా లుగా చేసి స్థానికంగా బిల్లులు లేకుండా అమ్మేస్తుంటారు. మొత్తం జీరో వ్యాపారం చేస్తే, ఎవరైనా అధికారులు తనిఖీ చేసినప్పుడు ఇబ్బందులు తప్పవు కాబట్టి కొంత బంగారాన్ని బిల్లులతో తెచ్చి ఆ లెక్కలనే దుకాణాల్లో చూపిస్తుంటారు. బిల్లులు లేకుండా బంగారాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చేందుకు వ్యాపారులు వారి వద్ద నమ్మకంగా పనిచేసే వ్యక్తులు, సీజన్‌ బాయ్స్‌ను ఉపయోగిస్తుంటారు. రూ.లక్షలు, రూ.కోట్లను వీరి చేతికి ఇచ్చి చెన్నైకి పంపుతుంటారు. ప్రతీ రోజూ పదుల సంఖ్యలోనే సీజన్‌బాయ్స్‌ చెన్నైకు వెళుతుంటారని సమాచా రం. చాలా సందర్భాల్లో వీరిని అధికారులు పట్టుకున్న సంఘ టనలూ ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో  విషయం తెలుసు కున్న వ్యక్తులు పోలీసులమంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఆ డబ్బునో లేక బంగారాన్నో దోచుకొని వెళుతుంటారు. ఇది జీరో వ్యాపారం కావడంతో చాలా సందర్భాల్లో వ్యాపారులు పోలీసు లను ఆశ్రయించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల దగ్గరకు కేసులు చేరినప్పుడు వారు దర్యాప్తు జరపగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో దుండగులు డబ్బులు దోచుకెళ్లినప్పటికీ అది బ్లాక్‌ మనీ కావడం, జీరో వ్యాపారం చేసే సమయంలో దోచుకెళ్లడంతో ఎక్కడ పోలీసులకు చెబితే మళ్లీ మన మీదకే వస్తుందిలే అన్న ఉద్దేశంతో చాలా వరకు చెప్పడం లేదు. 


తనిఖీ చేస్తే బట్టబయలు..


జిల్లాలో కొన్నేళ్ల నుంచి జీరో బంగారం వ్యాపారం జరుగు తుందన్నది బహిరంగ రహస్యం. అనేక సార్లు డీఆర్‌ఐ అధికా రులు, రైల్వే పోలీసులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. బంగారం దుకాణాల్లో కూడా చాలా వరకూ బిల్లులు లేకుం డానే అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ దుకాణాల్లో ఆకస్మి కంగా దాడులు జరిపితే  అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ సంబంధిత అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ నెలా జిల్లాలో కొన్ని రూ.వందల కోట్ల బంగారం వ్యాపారం జరుగు తున్నా ఆ స్థాయిలో ప్రభుత్వానికి  పన్నులు చెల్లిస్తున్నారా.. లేదా? అన్నది పరిశీలిస్తే జీరో దందా బట్టబయలవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-12-21T04:33:19+05:30 IST