అమ్మాయి మగవేషధారణలో ఉండటంతో..

ABN , First Publish Date - 2020-03-08T09:42:43+05:30 IST

జాతీయ రహదారి మీదుగా మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న మహిళలను అడ్డగించి ఒకరిపై అఘాయిత్యానికి

అమ్మాయి మగవేషధారణలో ఉండటంతో..

  • అడ్డగించి పొలాల్లోకి తీసుకెళ్లిన యువకులు
  • గ్రామస్థుల రాకతో పరారీ

కావలి రూరల్‌, మార్చి7: జాతీయ రహదారి మీదుగా మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న మహిళలను అడ్డగించి ఒకరిపై అఘాయిత్యానికి పాల్పడబోయిన సంఘటన శుక్రవారం రాత్రి కావలి పట్టణ జాతీయ రహదారి వెంబడి ఉన్న మహేంద్ర ప్లాట్లకు సమీపంలో జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు వెంగయ్యగారిపాలెం గ్రామానికి చెందిన సుభాషిణి, ఆమె స్నేహితురాలు మహాలక్ష్మీ మద్దూరుపాడు నుంచి వెంగయ్యగారిపాలెంకు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోటారు సైకిల్‌పై బయలుదేరారు. మద్యం సేవించే అలవాటు ఉన్న మహాలక్ష్మీ స్నేహితురాలు సుభాషితో కలసి వస్తూ మార్గమధ్యలోని మద్యం దుకాణం వద్ద ఆగారు. మద్యం లేకపోవటంతో తిరిగి గ్రామానికి బయలుదేరారు. వీరికి మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన చెన్నాయపాలెంకు చెందిన ముగ్గురు యువకులు అటకాయించి మగ వేషధారణలో ఉన్న మహాలక్ష్మీని  పురుషుడని భావించి ఆమెను పక్కకు నెట్టి సుభాషిణిని బలవంతంగా పక్కనున్న పొలాల్లోకి తీసుకెళ్లారు.


దీంతో మహాలక్ష్మీ మోటారుసైకిల్‌పై గ్రామానికి వెళ్లి పలువురికి చెప్పింది. పొలాల్లోకి తీసుకెళ్లిన సుభాషిణి పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తుండగా గ్రామస్థులు పలువరు మోటారు సైకిళ్లతో పెద్దగా అరుస్తూ సంఘటనాస్థలానికి చేరుకునేసరికి ఆ యువకులు అక్కడ నుంచి పారిపోయారు. ఆ యువకులు పారిపోతూ సుభాషిణి దగ్గర ఉన్న నల్లపూసల దండతో పాటు రూ. 5000 నగదు, కాళ్లపట్టీలు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. పారిపోయిన యువకులు చెన్నాయపాలెంకు చెందిన కాటంగారి శ్రీను, వాయిల బాబు, మరోవ్యక్తిగా గుర్తించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ ఎస్సై వెంకట్రావ్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-08T09:42:43+05:30 IST