స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

ABN , First Publish Date - 2020-12-14T04:05:05+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయ ఢంకా మోగించటానికి సిద్ధంగా ఉందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం
మాట్లాడుతున్న పోలంరెడ్డి

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

ఇందుకూరుపేట, డిసెంబరు 13 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయ ఢంకా మోగించటానికి సిద్ధంగా ఉందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పార్టీ కార్యకర్తల జరిగింది. సభలో పోలంరెడ్డి మాట్లాడుతూ రూ.300కోట్లతో మండలాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని, వైసీపీ నాయకులు మంచినీటీ సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు.  వైసీపీ ప్రభుత్వంలో రైతులు పూర్తిగా మోసపోయారని తెలిపారు. అంతేకాకుండా రేషన్‌ కార్డులను తొలగించి పేదల బతుకులతో ఆడుకుంటున్నారన్నారు. మండల నాయకులు వీరేంద్ర, ఎం.రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు 20 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2020-12-14T04:05:05+05:30 IST