కరోనా కలవరంతో నిలిచిన ‘యశ్వంత్‌పూర్‌’

ABN , First Publish Date - 2020-03-23T10:15:29+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి ్తయశ్వంత్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణిస్తునాడని

కరోనా కలవరంతో నిలిచిన ‘యశ్వంత్‌పూర్‌’

బిట్రగుంట,మార్చి22: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి ్తయశ్వంత్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణిస్తునాడని కంట్రోల్‌ కాల్‌ బిట్రగుంట రైల్వే అధికారులకు సమాచారం అందటంతో పరుగులు తీశారు. బిట్రగుంట రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫారం 1 లోకి ఆదివారం సాయంత్రం 7.40 గంటల ప్రాంతంలో కోల్‌కత్తా నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఎస్‌-5 బోగీలొ కరోనా అనుమానితులు ఉన్నట్లు రైల్వే అధికారులకు సమాచారం రావడంలో రైలును నిలిపారు. హటాహుటిన రైల్వే వైద్యాధికారిణి హసీనా బేగం, సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స చేశారు.


ఈ వార్త ప్రయాణికులకు తెలియడంతో అందరూ రైలు విడిచి పరుగులు తీశారు. కాగా వైద్యాధికారిణి అధికారులతో మాట్లాడటంతో రైలు బయలుదేరింది. కాగా ఆ బోగిలో ఉన్నది ఇతర దేశానికి చెందిన ఇద్దరు(స్ర్తీ, పురుషులు) కోలకత్తా (హౌరా) నుంచి కేరళకు వెళుతునట్లు తెలిసింది. 31 నిమిషాల పాటు బిట్రగుంటలో నిలిచిన రైలు తరువాత యధావిధిగా కొసాగింది. 

Updated Date - 2020-03-23T10:15:29+05:30 IST