-
-
Home » Andhra Pradesh » Nellore » Woman dies suspicious in well
-
బావిలో మహిళ అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-03-24T07:24:21+05:30 IST
మండలంలోని పుదూరు సమీపంలోని బావిలో ఓ మహిళ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం స్థానికులు

నాయుడుపేట టౌన్, మార్చి 23: మండలంలోని పుదూరు సమీపంలోని బావిలో ఓ మహిళ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. పుదూరు గ్రామానికి చెందిన ఇరుగు శివమ్మకు చిట్టమూరు మండలం ఉప్పలమర్తికి చెందిన చెంగయ్యతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో శివమ్మ తన కుమార్తెతో కలసి పుదూరులో తన తండ్రి సుబ్రహ్మణ్యం వద్ద ఉంటూ కుమార్తెను తమ్ముడికి ఇచ్చి వివాహం చేసింది. ఈ తరుణంలో మూడు రోజుల క్రితం ఉప్పలమర్తికి వెళ్లి వస్తానని తండ్రికి చెప్పి వెళ్లిన ఆమె బావిలో శవమై తేలింది. పోలీసుల అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.