చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , First Publish Date - 2020-04-21T05:43:13+05:30 IST

పట్టణంలోని ఎన్‌ఎ్‌సఆర్‌ కాలనీకి చెందిన మహిళ నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆదివారం...

చికిత్స పొందుతూ మహిళ మృతి

నాయుడుపేట టౌన్‌, ఏప్రిల్‌ 20 : పట్టణంలోని ఎన్‌ఎ్‌సఆర్‌ కాలనీకి చెందిన మహిళ నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎన్‌ఎ్‌సఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సాయమ్మ (24)ఈ నెల 14వ తేదీ కుటుంబ కలహాలతో ఇంట్లో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకై నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయమ్మ శనివారం మృతి చెందింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-21T05:43:13+05:30 IST