-
-
Home » Andhra Pradesh » Nellore » wife commit suicide after husband went to bath
-
ఘోరం.. భర్త స్నానానికి వెళ్లిన సమయంలో ఆ భార్య చేసిన దారుణమిదీ..!
ABN , First Publish Date - 2020-06-22T20:19:53+05:30 IST
నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్‌లో ఆదివారం మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా నందలూరుకు చెందిన మేఘన(22)కు

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
కట్నం వేధింపులే కారణమా?
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్‌లో ఆదివారం మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా నందలూరుకు చెందిన మేఘన(22)కు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సుధీర్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్లబాబు, రెండేళ్ల పాప ఉన్నారు. ఆదివారం మేఘనతో భర్త తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన మేఘన భర్త స్నానానికి వెళ్లిన సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. స్నానం ముగించుకుని వచ్చిన సుధీర్ మేఘన మృతదేశాన్ని చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, సీఐ సోమయ్య, ఎస్‌ఐ అంకమ్మ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.
మేఘన తల్లిదండ్రులు నెల్లూరుకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మేఘనను భర్త సహా అత్తింటి వారు కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలిసింది. ఆదివారం కూడా ఈ విషమయ్యే వాగ్వాదం జరిగిందని, దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి ఒడిగట్టిందని సమాచారం. కాగా, మేఘన తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, భర్త సుధీర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంకమ్మ తెలిపారు.