కొత్త డీఈవో ఎవరు ?

ABN , First Publish Date - 2020-07-31T11:16:32+05:30 IST

జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) జనార్దనాచార్యులు శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.

కొత్త డీఈవో ఎవరు ?

 పోటీలో ముగ్గురు అధికారులు


నెల్లూరు (విద్య) జూలై 30 : జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) జనార్దనాచార్యులు శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్ధానంలో వచ్చేందుకు ముగ్గురు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రశాంతమైన జిల్లాతోపాటు విద్యా పరంగా కీర్తి కలిగిన నెల్లూరులో పనిచేసేందుకు విద్యాశాఖలో పలువురు ఆసక్తి కనపరుస్తున్నారు.  ఈ క్రమంలో నూతన డీ ఈవోగా వచ్చేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ అధికా రిణితోపాటు గతంలో జిల్లాలో డీఈవోగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో అందరికీ సుపరిచితుడైన అధికారి, గుంటూరుకు చెందిన మరో అధికారి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.


వీరిలో గతంలో జిల్లాలో డీఈవోగా పనిచేసిన అధికారి వైపు కొంతమంది ఎమ్మెల్యేలు మొగ్గుచూపుతుండగా, గుంటూరు అధికారికి మరికొందరు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే  అధికారిణి తాహేరాసుల్తానా మాత్రం మంత్రి అనిల్‌కుమార్‌ను పలుమార్లు కలవడంతో ఆయన అంగీకారం తెలిపినట్లు విస్తృత ప్రచారం జరుగుతోం ది. ఈ తరుణంలో ఈ ముగ్గురిలో ఎవరిని డీఈవోగా నియమిస్తారన్న అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-07-31T11:16:32+05:30 IST