అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2020-12-29T04:30:05+05:30 IST

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సచివాలయ సిబ్బందికి సూచించారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

జేసీ ప్రభాకర్‌రెడ్డి 

   నాయుడుపేట, డిసెంబరు 28 : అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సచివాలయ సిబ్బందికి సూచించారు.  స్థానిక పెసల గురప్పశెట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం డివిజన్‌ పరిధిలోని 6 మండలాల సచివాలయాల్లో పనిచేస్తున్న సంక్షేమ, విద్యాసహాయకులకు సమావేశం  జరిగింది. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లను సచివాలయంలో కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సంక్షేమ పథకాలకు అర్హత కలిగి ఉండాలంటే కావాల్సిన వివరాలను ఆయా పథకాల ప్రత్యేక అధికారులు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ దాసు, నాయుడుపేట ఆర్డీవో సరోజిని, డీఎల్‌డీవో వసుంధర, కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, 6 మండలాల ఎంపీడీవోలు శివప్రసాద్‌, శివయ్య, నర్మద,  రఘురామ్‌, రమణయ్య, ప్రమీలారాణి, మండల పరిషత్‌ అడ్మినిస్ర్టేట్‌ అధికారి కె. రవిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:30:05+05:30 IST