మహిళల కోసం సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2020-09-12T10:46:35+05:30 IST
మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్

‘ఆసరా’ ప్రారంభోత్సవంలో మంత్రి అనిల్
నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 11 : మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం వైఎస్‌ఆర్ ఆసరా పథకాన్ని అమరావతి నుంచి ప్రారంభించారు. నెల్లూరులోని జిల్లా ఎమర్జెన్సీ కేంద్రం నుంచి ఈ కార్యక్రమాన్ని మంత్రి అనిల్‌తోపాటు కలెక్టర్ చక్రధర్‌బాబు, జేసీ(ఆసరా) సూర్యప్రకాష్, డీఆర్‌డీఏ పీడీ ఎస్‌వీ నాగేశ్వరరావు, మెప్మా పీడీ రవీంద్రబాబు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు తిలకించారు.
అనంతరం జిల్లాలో పథకాన్ని మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. 2019 ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రంలోని 87.74 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన బ్యాంకు రుణాల మొత్తం రూ.27,168 కోట్లను నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో జమచేయటం జరుగుతుందన్నారు. . జిల్లాలోని 42,107 పొదుపు సంఘాలలోని 4,19,193 మంది సభ్యులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారని చెప్పారు. తొలి విడతగా మంజూరైన రూ.340.01 కోట్ల చెక్కును పొదుపు సభ్యులకు అందచేశారు. అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇద్దరికి రూ.50వేల వంతున చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమాల్లో ఎల్‌డీఎం రాంప్రసాద్‌రెడ్డి, డీఆర్‌డీఏ అధికారి సుధాకర్, జిల్లా, పట్టణ సమాఖ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.