తాగునీరు కలుషితం కాలేదు..

ABN , First Publish Date - 2020-12-14T04:12:21+05:30 IST

కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో వలస కూలీల అస్వస్ధతకు కారణం తాగునీరు కలుషితం కాదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి వెల్లడించారు.

తాగునీరు కలుషితం కాలేదు..
మాట్లాడుతున్న డాక్టర్‌ రాజ్యలక్ష్మి

తిన్న ఆహారం వల్లే కూలీలకు అస్వస్థత ?

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి


నెల్లూరు(వైద్యం)డిసెంబరు 13 : కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో వలస కూలీల అస్వస్ధతకు కారణం తాగునీరు కలుషితం కాదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి వెల్లడించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాగునీటి పరీక్షల్లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టమయిందని చెప్పారు.  తీసుకున్న ఆహారం కలుషితం కావటం వల్లే కూలీలు అస్వస్ధతకు లోనయి ఉండవచ్చని డీఎంహెచ్‌వో తెలిపారు. ఏలూరులో వెలుగు చూసిన వింతవ్యాధికి, దీనికి సంబంధం లేదని చెప్పారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో ఇలాంటి సంఘటనలు వెలుగుచూడకుండా వైద్యులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో మండల స్ధాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కలువాయి పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ సురేంద్ర వలస కూలీలకు తక్షణం వైద్య సేవలు అందించటంలో ఎంతో కృషిచేశారని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-12-14T04:12:21+05:30 IST