జనజాతి గౌరవ దివస్ గోడ పత్రిక విడుదల
ABN , First Publish Date - 2020-11-14T03:24:11+05:30 IST
స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ జనజాతి గౌరవ దివస్ గోడ పత్రికలను ఆవిష్కరించారు.
గూడూరు(రూరల్), నవంబరు 13: స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ జనజాతి గౌరవ దివస్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారితో పోరాడి 20 ఏళ్ల వయసుకే ప్రాణత్యాగం చేసిన గిరిజనయోధుడు భగవాన్ బిర్సా ముండా అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకుడు మనోజ్‌కుమార్, చిన్నా, కార్తీక్, వెంకటేష్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.