-
-
Home » Andhra Pradesh » Nellore » vybhavanga pojalu
-
వైభవంగా ఆరుద్ర నక్షత్ర పూజలు
ABN , First Publish Date - 2020-12-31T04:00:26+05:30 IST
మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం ఆరుద్ర (మల్లికార్జునస్వామి పుట్టిన )నక్షత్రం సందర్భంగా మల్లికార్జు

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు30: మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం ఆరుద్ర (మల్లికార్జునస్వామి పుట్టిన )నక్షత్రం సందర్భంగా మల్లికార్జునస్వామి, కామాక్షితాయి వార్లు శివకామసుందరి, నటరాజస్వామి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి రుద్ర పాదుకలకు పంచామృత అభిషేకం, సహస్రనామార్చన పూజలు చేశారు. అనంతరం స్వామి వారి శఠారితో భక్తులకు ఆశీర్వాచనాలు అందజేసి ప్రసాదం పంపిణీ చేశారు.