వ్యభిచార గృహంపై దాడి
ABN , First Publish Date - 2020-12-04T02:30:34+05:30 IST
పట్టణంలోని పాతూరులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై గురువారం ఒకటో పట్టణ సీఐ కె.శ్రీనివారావు తమ సిబ్బందితో దాడిచేశారు. ఈ

ముగ్గురు నిర్వాహకులు, ఇద్దరు విటుల అరెస్ట్
కావలి రూరల్, డిసెంబరు3: పట్టణంలోని పాతూరులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై గురువారం ఒకటో పట్టణ సీఐ కె.శ్రీనివారావు తమ సిబ్బందితో దాడిచేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముగ్గురితోపాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు, కావలి క్రిష్టియన్‌పేటకు చెందిన కందుల రాజేష్, పర్వీన్, గుర్రంవారి వీధికి చెందిన షేక్ సుల్తానీలు కొంత కాలంగా పాతూరులో వ్యభిచారగృహం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఇక్కడ వ్యబిచారం చేయిస్తున్నారు. అక్కడకు కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నెకు చెందిన బలగాని కృష్ణ, ఉప్పాల మహేష్‌లు రావటంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులు, ఇద్దరు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరి మహిళలను వదిలేసి మిగిలిన ఐదుగురుపై కేసు నమోదు చేశారు. వ్యభిచార గృహంపై దాడిచేసిన సీఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రసాద్ అభినందించారు.