విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా తయారుకావాలి

ABN , First Publish Date - 2020-12-08T01:20:59+05:30 IST

వీఎస్‌యూ విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా తయారు కావాలని శాంతా బయోటెక్నాలజీ చైర్మన్‌, పద్మభూషణ్‌

విద్యార్థులు సమాజానికి   ఉపయోగపడేలా తయారుకావాలి
ఆన్‌లైన్‌ వెబినార్‌లో డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి

కటాచలం, డిసెంబరు 7 :  వీఎస్‌యూ  విద్యార్థులు   సమాజానికి ఉపయోగపడేలా తయారు కావాలని శాంతా బయోటెక్నాలజీ చైర్మన్‌, పద్మభూషణ్‌ డాక్టర్‌ కే వరప్రసాద్‌రెడ్డి అన్నారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో సింహపురి విశిష్ట ఉపన్యాస సిరీస్‌ మూడవ ఉపన్యాసం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెబినార్‌లో ఆయన మాట్లాడారు.  స్వలాభాల కన్నా సమాజ శ్రేయస్సు కోసం తీసుకొచ్చే ఉత్పత్తులు ఉన్నత స్థాయికి  వెళ్తాయన్నారు. కొత్త ఆవిష్కరణలు వాణిజ్యపరంగా కాకుండా సాంఘిక ప్రయోజనాలు కలిగివుండేవిగా ఉండాలన్నారు. కొవిడ్‌ వలన అనేక నూతన ఆవిష్కరణలు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం కలిగిందన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ వీసీ రొక్కం సుదర్శన రావు, రెక్టార్‌ ఎం చంద్రయ్య, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌, పీజీ సెంటర్‌ ప్రత్యేక అధికారి సీహెచ్‌ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-08T01:20:59+05:30 IST