జిల్లా ఓటర్లు 24.35 లక్షల మంది

ABN , First Publish Date - 2020-11-14T03:08:27+05:30 IST

జిల్లాలో 24,35,035 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

జిల్లా ఓటర్లు 24.35 లక్షల మంది

పురుషుల కంటే మహిళలే ఎక్కువ

ముసాయిదా జాబితా ప్రకటించిన కలెక్టర్‌ 

నెల్లూరు (హరనాథపురం), నవంబరు 13 : జిల్లాలో 24,35,035 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పురుషులు 11,92,916 మంది, మహిళలు 12,42,119 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యలో 49,203 మంది మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 16న ప్రచురించనున్న జిల్లావ్యాప్త ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రకటించారు. ఈ నెల 16 నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఓటరు నమోదుకు ఈ నెల 28, 29 తేదీలను, డిసెంబరు 12, 13 తేదీలను ప్రత్యేక ప్రచార రోజులుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2021, జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన లేదా నిండుతున్నట్లయితే వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. జనవరి 15న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. 


నియోజకవర్గాల వారీగా...

నియోజవర్గం పోలింగ్‌ కేంద్రాలు     పురషులు స్త్రీలు         మొత్తం

కావలి         314         127053         132998     260051

ఆత్మకూరు         278         105517         107230      212747

కోవూరు 323         128143            138143     266286

నెల్లూరుసిటీ         248         117646         123169     240815

నెల్లూరు రూరల్‌ 266         128022          134758     262780

సర్వేపల్లి 282         114188         119327     233515

గూడూరు 289         118770         124682     243452

సూళ్లూరుపేట 296         116290         120872     237162

వెంకటగిరి         296    119756         123363     243119

ఉదయగిరి         323          117531         117577     235108

మొత్తం 2915         1192916         1242119     2435035 

Updated Date - 2020-11-14T03:08:27+05:30 IST