-
-
Home » Andhra Pradesh » Nellore » volunteer duties
-
‘వలంటీరు విధులకు ముందుకు రండి’
ABN , First Publish Date - 2020-03-24T17:15:46+05:30 IST
మెడికల్ విభాగంలో వలంటీరుగా సేవలు అందించేందుకు..

నెల్లూరు(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెడికల్ విభాగంలో వలంటీరుగా సేవలు అందించేందుకు అనుభవమున్నవారు ముందుకు రావాలని కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణులైన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, నాన్ మెడికల్ సిబ్బంది, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్ విద్యార్థులంతా వలంటీర్లుగా విధులు నిర్వహించవచ్చన్నారు. వలంటీర్లుగా వచ్చేవారు జిల్లాలోని తమకు ఇష్టమైన మండలాన్ని ఎంచుకోవచ్చని, www.spsnellore.ap.gov వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి వారు కోరుకున్న మండలాల్లో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు.