బిలకూట క్షేత్రంలో మహావిష్ణుగా ప్రసన్న వేంకటేశ్వరుడి ఉత్తరద్వార దర్శనం

ABN , First Publish Date - 2020-12-26T03:45:48+05:30 IST

ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం బోగోలు మండలం బిలకూట క్షేత్రంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై మహావిష్ణుమూర్తి అవతారంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు.

బిలకూట క్షేత్రంలో మహావిష్ణుగా ప్రసన్న వేంకటేశ్వరుడి ఉత్తరద్వార దర్శనం
ఉత్తర ముఖ ద్వారంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్యెల్యే దంపతులు

బిట్రగుంట, డిసెంబరు 25: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం బోగోలు మండలం బిలకూట క్షేత్రంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై మహావిష్ణుమూర్తి అవతారంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వామిఅమ్మ వార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కావలి ఎమ్యెల్యే ప్రతాప్‌ కుమార్‌రెడ్డి దంపతులు, కావలి మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో రాధాకృష్ణ, పాలక మండలి చెర్మన్‌ శ్రీరాం మాల్యాద్రి, అర్చకులు వారికి స్వాగతం పలికారు. చెంచులక్ష్మీపురం కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తి అవతారంలో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చక వేదపండితులు వరహాచల సాయిరామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దాత రామిశెట్టి వెంకటసుబ్బారావు సహకారంతో ముద్రించిన 2021 సంవత్సర క్యాలెండరును ఎమ్యెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, ఆప్కాఫ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  స్థానిక నేతలు కర్తం సురేంద్రరెడ్డి, ఆర్‌.వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌, నాగరాజు, మెతుకు రాజేశ్వరి, పాలక మండలి సభ్యులు తదితరులు ఉన్నారు.  

వ్యాపార ధోరణీని సహించం

బిలకూట క్షేత్రంలో స్వామి అమ్మవార్లను దర్శింఉకునేందుకు వచ్చిన భక్తులను వ్యాపార ధోరణీతో చూస్తూ అవమాన పరచడం మంచిది కాదని పాలక మండలి చైర్మన్‌ శ్రీరాం మాల్యాద్రిపై భక్తులు, స్థానికులు చైర్మన్‌తో వాగ్వివాదాలకు దిగారు. 

Updated Date - 2020-12-26T03:45:48+05:30 IST