గ్రామానికి దూరంగా.. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు

ABN , First Publish Date - 2020-12-31T05:26:26+05:30 IST

కులమతాలకు అతీతంగా లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు.

గ్రామానికి దూరంగా.. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు
గ్రామానికి దూరంగా ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన లేఅవుట్‌

ఏఎస్‌ పేట,డిసెంబరు30: కులమతాలకు అతీతంగా లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు.  ఎస్సీ,ఎస్టీ కాలనీల పేర్లు మార్చాలని, వారిని వేరుగా చూడరాదని సుప్రీంకోర్డు కూడా ఆదేశించింది. కానీ.. సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. ఇందుకు ఏఎస్‌ పేట మండలం చౌటభీమవరంలో జరిగిన సంఘటనే నిదర్శనం.  గ్రామంలోని 28 మందికి ప్రభుత్వం ఉచితంగా అందించే ఇళ్ల స్ధలాల కోసం గ్రామం మధ్యలో సచివాలయం ఎదురుగా ఓ లేవుట్‌ను, గ్రామానికి దూరంగా సబ్‌స్టేషన్‌ సమీపంలో మరో లేవుట్‌ ఏర్పాటు చేశారు. బుధవారం అధికారులు  ఇళ్ల పట్టాలను  పంపిణీ చేశారు. కానీ.. 28 మందిలో ఓసీ, బీసీలకు మాత్రం గ్రామంలో స్ధలాలు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీలకు గ్రామానికి దూరంగా ఉన్న లేవుట్‌లో పట్టాలు ఇచ్చారు. దీంతో ఇద్దరు మహిళలు పట్టాలు తీసుకునేందుకు నిరాకరించారు. లాటరీ పద్ధతి సఽ్ధలాలు కేటాయించాలి కానీ.. అలా కాకుండా నాయకులు చెప్పినట్లు, అధికారులు స్ధలాలు కేటాయించారని పలువురు అవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-31T05:26:26+05:30 IST