వినాయక ఆలయంలో మహా కుంభాభిషేకం

ABN , First Publish Date - 2020-12-12T04:31:31+05:30 IST

ఇందిరానగర్‌ సమీపంలోని స్వయంభు మోదుగవన వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం విఘ్నేశ్వరపూజ, ప్రాణ ప్రతిష్ఠ, శిఖరాభిషేకం, మహాకుంబాభిషేకం నిర్వహించారు.

వినాయక ఆలయంలో మహా కుంభాభిషేకం
శిఖర పూజలు చేస్తున్న పండితులు, దాత

గూడూరు, డిసెంబరు 11: ఇందిరానగర్‌ సమీపంలోని స్వయంభు మోదుగవన వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం విఘ్నేశ్వరపూజ, ప్రాణ ప్రతిష్ఠ, శిఖరాభిషేకం, మహాకుంబాభిషేకం నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి బుడంగుంట రవికుమార్‌రెడ్డి దాతృత్వం వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మల్లు విజయకుమార్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:31:31+05:30 IST