ప్రొవిజన్స్‌ దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2020-03-24T07:25:11+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లతో ప్రజలు ఇళ్లను విడిచి బయటకు

ప్రొవిజన్స్‌ దుకాణాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు


నెల్లూరు (క్రైం), మార్చి 23 : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా  జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లతో ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రాలేని పరిస్థితి. దుకాణాలను సైతం పూర్తిగా మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఒక్క సారిగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు నగరంలో విజిలెన్స్‌ అధికారులు ప్రొవిజన్స్‌ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.


స్టోన్‌హౌ్‌సపేటలోని నిత్యావసర దుకాణాలు, కూరగాయల మార్కెట్లోని షాపులు, మెడికల్‌ షాపులు, గ్యాస్‌ గోదాముల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ధరల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణ యజమానులను హెచ్చరించారు. ఈ తనిఖీలలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more