వ్యర్థ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2020-12-18T02:51:28+05:30 IST
చౌకిచర్లను వ్యర్ధ రహిత గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఈవోపీఆర్డీ సాయిప్రసాద్ తెలిపారు. చౌకిచర్లలో

విడవలూరు, డిసెంబరు 17: చౌకిచర్లను వ్యర్ధ రహిత గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఈవోపీఆర్డీ సాయిప్రసాద్ తెలిపారు. చౌకిచర్లలో వ్యర్ధాలపై పోరాటంలో బాగంగా గురువారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ సర్వరోగాలకు చెత్త కారణమన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయటం మూలంగా దోమలు పెరిగి, వ్యాధులు వస్తున్నాయన్నారు. ఇంటిలోని వ్యర్ధాలను చెత్త కుండీల్లో వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్మయి, గ్రామ పెద్దలు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.