-
-
Home » Andhra Pradesh » Nellore » venugopal
-
పీఎంపీ వేణుగోపాల్‌కు జాతీయ సేవా పురస్కారం
ABN , First Publish Date - 2020-12-11T05:25:27+05:30 IST
ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ జాతీయ సేవా పురస్కారం అందుకు న్నారు.

నెల్లూరు(వైద్యం), డిసెంబరు 10 : ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ జాతీయ సేవా పురస్కారం అందుకు న్నారు. గురువారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జయ జయ దత్తసాయి ట్రస్ట్ ఈ పురస్కారాన్ని అందచేసింది. ఆ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఇలాంటి జాతీయ సేవా పురస్కారాలు అందచేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్‌కు పురస్కారం అందించామన్నారు. ప్రాథమిక వైద్య సేవలకే పరిమితం కాకుండా ఆరోగ్య అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు, కరోనా అవగాహన సదస్సులు, వలస కూలీలకు అన్నదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పురస్కారం మరింత బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా వేణుగోపాల్ పేర్కొన్నారు.