వాహనాల నిలిపివేతతో నిర్మానుష్యంగా జాతీయ రహదారి

ABN , First Publish Date - 2020-11-28T04:43:20+05:30 IST

నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే నాయుడుపేట - మల్లాం క్రాస్‌రోడ్డు జాతీయ రహదారి ప్రాంతం శుక్రవారం వెలవెలబోయింది.

వాహనాల నిలిపివేతతో నిర్మానుష్యంగా జాతీయ రహదారి
నిర్మానుష్యంగా నాయుడుపేట - మల్లాం క్రాస్‌రోడ్డు జాతీయ రహదారి

నాయుడుపేట టౌన్‌, నవంబరు 27 : నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే నాయుడుపేట - మల్లాం క్రాస్‌రోడ్డు జాతీయ రహదారి ప్రాంతం శుక్రవారం వెలవెలబోయింది. మనుబోలు వద్ద జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యగా సూళ్లూరుపేట టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిపివేశారు. దాంతో  జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది.


Read more