వేదగిరిపై భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-26T04:59:48+05:30 IST

వివిధ రకాలు దోషాలు, లోపాలను నివారించి, తిరిగి పవిత్రతను ప్రతిష్ఠించేందుకు వేదగిరి క్షేత్రంపై నిర్వహిస్తున్న ఉత్సవాలు రెండోవ రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వేదగిరిపై భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చక బృందం

 నెల్లూరురూరల్‌, నవంబరు 25 : వివిధ రకాలు దోషాలు, లోపాలను నివారించి, తిరిగి పవిత్రతను ప్రతిష్ఠించేందుకు వేదగిరి క్షేత్రంపై నిర్వహిస్తున్న ఉత్సవాలు రెండోవ రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నరసింహస్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలకరించిన అర్చక బృందం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేన పూజ నిర్వహించి పుణ్యాహవాచనం చేపట్టారు. పంచగవ్య ఆరాధన, రక్షబంధన పూజలను వైభవంగా జరిపించారు. శాలావాస్తు, అకల్షషహోమం, స్నపనతిరుమంజనం నిర్వహించి అనంతరం పవిత్ర హోమాలను కొనసాగించారు. పూజలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, ఈవో శ్రీనివాసులురెడ్డి, తదితరులు  పర్యవేక్షించారు.  

Read more