వర్షంతో నిమ్మరైతు కుదేలు

ABN , First Publish Date - 2020-12-18T02:29:35+05:30 IST

పొదలకూరు వ్యవ సాయ సబ్‌డివిజన్‌లోని మెట్టప్రాంతాల్లో ఒకప్పుడు సిరులు కురిపిం చిన

వర్షంతో నిమ్మరైతు కుదేలు
పూత, పిందె లేకుండా ఉన్న నిమ్మచెట్లు

తగ్గుతున్న దిగుబడులు

పొదలకూరు(రూరల్‌), డిసెంబరు 17 : పొదలకూరు వ్యవ సాయ సబ్‌డివిజన్‌లోని మెట్టప్రాంతాల్లో ఒకప్పుడు సిరులు కురిపిం చిన నిమ్మసాగు నేడు నష్టాలలో ఉంది. ఈ సంవత్సరం కరోనా  కా రణంగా నిమ్మరైతుల కష్టం నేలపాలై పోయింది. ఈ సంవత్సరం అ యినా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుంని ఆశపడిన రైతుల నో ట్లో విడవని వర్షాల కారణంగా మన్ను పడింది.  నిమ్మరైతులకు ఏడాదంతా ఒక  ఎత్తెయితే మార్చి, ఏప్రిల్‌, మే మాసాలు ఒక ఎత్తు. సంవత్సరంలో 9 నెలలు గరిష్ఠంగా రూ.1000 నుంచి 1500 ధర ప లుకుతాయి. మార్చి నుంచి లూజు బస్తా ధర వేలల్లో పలుకుతుంది. 2019లో గరిష్ఠంగా రూ.15వేలు పలికింది. ఈ సంవత్సరం కూడా అ దే స్థాయిలో ధర వస్తుందని ఆశపడిన రైతులు భంగపడ్డారు. సరిగ్గా మార్చి 23 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రవాణా ఆగి పోయింది. మార్కెట్‌లు మూతపడటంతో దిగుబడి నేలపాలు కావ డంతో రైతులు వ్యక్తిగతంగా లక్షల్లో నష్టపోయారు. ఆరుగాలం కష్టప డిన రైతుల రెక్కల కష్టం నేల పాలైంది. ఏదో ఈ సంవత్సరమైనా నాలుగు డబ్బులు రాబట్టుకుందాం.. అనే ఆశతో ఉన్న రైతులకు భారీ వర్షాలు శరఘాతమయ్యాయి. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో కాయలు రావాలంటే నవంబరు, డిసెంబరులో చెట్లు పూత పూయాలి. కానీ సెప్టెంబరు నుంచి విడవని భారీ వర్షాల కారణంగా నిమ్మతోటల్లో పూత కనబడటం లేదు. నేల పూర్తిస్థాయిలో ఆరిపోతే తప్ప చెట్లు పూతకు రావు. వర్షం ఆగి వారం కావస్తున్నా నిమ్మచెట్ల పాదుల్లో నె మ్ము ఆరలేదు. డిసెంబరు గడుస్తున్నా తోటల్లో పూత కానరాకపోవ డంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గడిచిన రెండేళ్లుగా దిగు బడి ఉన్నా అమ్ముకోలేని స్థితిలో ఉన్న రైతులు ఈ ఏడాదైనా గట్టున పడదామని ఆశించిన రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Updated Date - 2020-12-18T02:29:35+05:30 IST