-
-
Home » Andhra Pradesh » Nellore » uvakunipy daadi
-
యువకుడిపై దాడి
ABN , First Publish Date - 2020-12-20T02:13:17+05:30 IST
మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్‌పూర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంక్ వద్ద శుక్రవారం రాత్రి ఓ యువకుడిపై

వెంకటాచలం, డిసెంబరు 19 : మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్‌పూర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంక్ వద్ద శుక్రవారం రాత్రి ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు , నెల్లూరు చిన్నబజారు కామాటివీధికి చెందిన మొహమ్మద్ జబీవుల్లా అనే యువకుడు టీ తాగుతుండగా చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో జబీవుల్లాని ఖలీల్ అనే వ్యక్తి కర్రతో కొట్టి బాటిల్‌తో తలపై తీవ్రంగా గాయపరిచాడు. అంతేకాకుండా జబీవుల్లా వద్ద ఉన్న స్మార్ట్ మొబైల్ ఫోన్‌తోపాటు మరికొంత నగదును అపహరించుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.