వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
ABN , First Publish Date - 2020-12-21T05:02:25+05:30 IST
వైసీపీ ప్రభుత్వ 18నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఆధ్యక్షుడు నరసింహయాదవ్ అన్నారు.

టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహయాదవ్
సూళ్లూరుపేట, డిసెంబరు 20 : వైసీపీ ప్రభుత్వ 18నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఆధ్యక్షుడు నరసింహయాదవ్ అన్నారు. స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో ఆదివారం పట్టణ పార్టీ, వార్డు కమిటీల ఎంపిక సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో వెనుకబడిన వర్గాల వారు 18600 ఉద్యోగాలను కోల్పోయారన్నారు. పేదల వద్ద ఉన్న 65వేల సీజేఎఫ్‌ఎస్ భూములను తిరిగి తీసుకొని డీకేటీ పట్టాలుగా చేసిందన్నారు. దాంతో వెనుకబడిన వర్గాలు అన్యాయమైపోయారన్నారు. ప్రస్తుతం బీసీ సంక్రాంతి అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తుందేతప్ప ఎక్కువగా వారిని అణగతొక్కే ప్రయత్నాలను చేస్తోందని విమర్శించారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అక్రమాలకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ద్వారా ఆ పార్టీకి గుణపాఠం చెబుతామని అన్నారు. సమావేశంలో పరిశీలకులు శ్రీనివాసులు, టీడీపీ నేతలు వేనాటి సతీష్‌రెడ్డి, చిట్టేటి పేరుమాల్, తిరుమూరు సుధాకర్‌రెడ్డి, ఆకుతోట రమేష్ పాల్గొన్నారు.