-
-
Home » Andhra Pradesh » Nellore » two persons wounded
-
రేకులు పడి ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2020-12-28T04:57:55+05:30 IST
నాయుడుపేట కూరగాయాల మార్కెట్‌లో రేకులు పడి ఇద్దరికి గాయాలయ్యాయి.

నాయుడుపేట టౌన్, డిసెంబర్ 27 : నాయుడుపేట కూరగాయాల మార్కెట్‌లో రేకులు పడి ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు కూరగాయాల మార్కెట్‌లోని దుకాణాలకు మరమ్మతులు చేస్తున్నారు. దుకాణాల ముందుభాగంలో రేకులు వేసే పనిని మున్సిపల్ అధికారులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆదివారం ఆ కాంట్రాక్టర్‌కు చెందిన ఇద్దరు కూలీలు రేకులు వేస్తుండగా ప్రమదవశాత్తూ వారిపై రేకులు పడి గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు.