అవినీతి ఉద్యోగులను బదిలీ చేయండి

ABN , First Publish Date - 2020-08-20T07:58:59+05:30 IST

విక్రమ సింహపురి యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని వీఎ్‌సయూ వి

అవినీతి ఉద్యోగులను బదిలీ చేయండి

 వీఎ్‌సయూ రిజిస్ర్టార్‌కు విద్యార్థి జేఏసీ వినతి


వెంకటాచలం, ఆగస్టు 18 : విక్రమ సింహపురి యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని వీఎ్‌సయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు నూకరాజు మదన్‌కుమార్‌రెడ్డి కోరారు. ఆయన, కొందరు నాయకులతో కలిసి మంగళవారం యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ ఎల్‌. విజయకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా మదన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వీఎ్‌సయూలోని ఎగ్జామినేషన్‌, సీడీసీ డీన్‌, ఫైనాన్స్‌, ఇతర విభాగాల్లో ఐదేళ్లుగా పని చేస్తున్న చాలా మంది ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


గతంలో అనేకసార్లు వీసీ, రిజిస్ర్టార్లకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. వారిని బదిలీ చేయని పక్షంలో యూనివర్సిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నివేదికను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మనోజ్‌ కుమార్‌రెడ్డి, వంశీ, వెంగల్‌రావు  పాల్గొన్నారు. 

Read more