ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ABN , First Publish Date - 2020-12-06T02:54:28+05:30 IST
పట్టణ నడిబొడ్డున ట్రంకురోడులో నిత్యం ఉత్ఫన్నమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఒకటో పట్టణ సీఐ కే శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు.
కావలి, డిసెంబరు 5: పట్టణ నడిబొడ్డున ట్రంకురోడులో నిత్యం ఉత్ఫన్నమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఒకటో పట్టణ సీఐ కే శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. తమ సిబ్బందితో కలసి శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రంకు రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలు తీసి జరిమానాలు విధించారు. వాహన రికార్డులు పరిశీలించారు. రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సు లేనివారికి జరిమానాలు విధించారు. కొందరు మైనర్లు వాహనాలు నడుపుతుండటంతో పట్టుకుని వారి తల్లి తండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి వాహనాలు ఇస్తే తల్లి తండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పట్టణంలో ఎక్కడా పార్కింగ్ స్థలం లేక పోవడం, షాపింగ్‌కు వచ్చిన ప్రజలు తమ వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేసి షాపింగ్‌కు వెళ్లి వచ్చే లోపు జరిమానాలు విధించడంతో వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేశారు.