రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-12-02T04:40:20+05:30 IST

మండలంలోని టెంకాయతోపు గ్రామం వద్ద మంగళవారం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరు యువకులు బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులు

పెళ్లకూరు, డిసెంబరు 1 : మండలంలోని టెంకాయతోపు గ్రామం వద్ద మంగళవారం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరు యువకులు బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డారు. వాకాడు గ్రామానికి చెందిన షమీవుల్లా, బాబు  పనుల కోసం వాకాడు నుంచి ద్విచక్రవాహనంలో శ్రీకాళహస్తికి వెళ్తున్నారు. టెంకాయతోపు గ్రామం వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా  గేదె అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సమీవుల్లా, బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆటో ద్వారా పెళ్లకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాయుడుపేటకు తరలించారు.

Updated Date - 2020-12-02T04:40:20+05:30 IST