నేడు రైతు భరోసా కేంద్రాల ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-30T11:07:05+05:30 IST

రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలతోపాటు సేవలను కూడా క్షేత్రస్థాయిలోనే అందించేందుకు

నేడు రైతు భరోసా కేంద్రాల ప్రారంభం

ఓజిలి ఆర్‌బీకేని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి


నెల్లూరు(వ్యవసాయం), మే 29 : రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలతోపాటు సేవలను కూడా క్షేత్రస్థాయిలోనే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) శనివారం ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 660 కేంద్రాలు ప్రారంభం కానుండగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఓజిలి కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి రైతులతో మాట్లాడనున్నారు. తొలుత కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని ఒక కేంద్రాన్ని సీఎం ప్రారంభిస్తారని భావించి ఆ మేరకే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఓజిలి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు శుక్రవారం తెలియడంతో ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలోని మిగిలిన ఆర్‌బీకేలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-05-30T11:07:05+05:30 IST