నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-02-08T06:47:51+05:30 IST

జిల్లాలోని మర్రిపాడు మండలం క్రిష్ణాపురం నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీ సీట్లకు సంబంధించి

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

మర్రిపాడు, ఫిబ్రవరి 7: జిల్లాలోని మర్రిపాడు మండలం క్రిష్ణాపురం నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీ సీట్లకు సంబంధించి శనివారం ప్రవేశపరీక్ష జరగనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో 8 సీట్లకు 628 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు సంబంధిత గుర్తింపు పత్రాన్ని చూపిస్తే విద్యాలయంలోనే అందజేస్తామన్నారు.

Updated Date - 2020-02-08T06:47:51+05:30 IST