నేడు జన్మాష్టమి

ABN , First Publish Date - 2020-08-11T10:22:43+05:30 IST

కృష్ణాష్టమి ని మంగళవారం జిల్లావ్యాప్తంగా జరుపుకోనున్నారు.

నేడు జన్మాష్టమి

కృష్ణ మందిరాలకు విద్యుత్‌ అలంకరణలు

ఏకాంతంగా వేడుకలు


నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) ఆగస్టు 10 :  కృష్ణాష్టమి ని మంగళవారం జిల్లావ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఇందు కోసం పలు ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది లాగా ఉత్సాహభరితంగా కాకుండా, కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నెల్లూరు మూలాపేట రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం, ఇస్కాన్‌ సిటీలోని కృష్ణమందిరం, కొండా యపాళెం రైల్వేగేటు, సుజాతమ్మకాలనీలోని కృష్ణమందిరం, బాలాజీనగర్‌, విఘ్నేశ్వరపురం తదితర ఆలయాలను  విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.స్వామి స్వామివారికి జరిగే నిత్యకైంకర్యాలు ఏకాంతంగా జరుగుతాయని, కంటైన్మెంట్‌ జోన్‌ వల్ల భక్తులకు ప్రవేశం లేదని మూలాపేట వేణుగోపాల స్వామి ఆలయ ఈవో జే శ్రీనివాసరావు, మేనేజింగ్‌ ట్రస్టీ మన్నెం లక్ష్మీనాథ్‌రెడ్డిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T10:22:43+05:30 IST