-
-
Home » Andhra Pradesh » Nellore » three vechles dee
-
మూడు వాహనాలు ఢీ
ABN , First Publish Date - 2020-12-28T05:10:40+05:30 IST
నెల్లూరులోని బుజబుజనెల్లూరు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగింది.

పలువురికి గాయాలు
నెల్లూరు(క్రైం), డిసెంబరు 27: నెల్లూరులోని బుజబుజనెల్లూరు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగింది. చెన్నై వైపు అతివేగంగా వెళ్తున్న లారీ రాజమండ్రి నుంచి నెల్లూరు నగరానికి వస్తూ హైవే దాటుతున్న కారున ఢీకొని రోడ్డుపైనే ఆగిపోయింది. అదే సమయంలో నెల్లూరు నుంచి వెంకటగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుకవైపు నుంచి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి. అలాగే బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్‌ఐ శంకర్‌రాజు అక్కడికి చేరుకుని వాహన రాకపోకలను పునరుద్ధరించారు. రాజమండ్రికి చెందిన కుటుంబం పెంచలకోనకు దైవదర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి కారణమైన లారీ డ్రైవర్ పరారుకాగా, లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.