వైభవంగా తీర్థ సంగ్రహణ

ABN , First Publish Date - 2020-02-12T09:41:10+05:30 IST

అల్లూరు మండలం ఇస్కపల్లిలో పునఃనిర్మాణానికి నోచుకున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారం దేవస్థానం ప్రారంభోత్సవ

వైభవంగా తీర్థ సంగ్రహణ

వెయ్యిమంది మహిళా భక్తులతో సముద్ర జలాభిషేకం


అల్లూరు, ఫిబ్రవరి 11 : అల్లూరు మండలం ఇస్కపల్లిలో పునఃనిర్మాణానికి నోచుకున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారం దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మొదటి రోజైన మంగళవారం తీర్థ సంగ్రహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బీద రవిచంద్ర, జ్యోతి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దాదాపు వెయ్యిమంది మహిళా భక్తులు పాల్గొని కుండల్లో సముద్ర జలాలను నింపుకొని ప్రతిష్ఠా విగ్రహాలకు జలాభిషేకం చేసే కార్యక్రమం కనుల పండువగా సాగింది. ఇస్కపల్లి సముద్ర తీరంలో విశేష పూజా కార్యక్రమాలను అర్చకులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు బీద గిరిధర్‌, కొనగళ్ల దయాకర్‌ నేతృత్వం వహించారు.

Updated Date - 2020-02-12T09:41:10+05:30 IST