కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-03-19T09:42:47+05:30 IST

గంటల వ్యవధిలో పోలీసులు కిడ్నాప్‌ కేసును ఛేదించారు. చెన్నైలో ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని

కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

నెల్లూరు (క్రైం), మార్చి 18 : గంటల వ్యవధిలో పోలీసులు కిడ్నాప్‌ కేసును ఛేదించారు. చెన్నైలో ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని నెల్లూరులోని ఓ లాడ్జిలో పట్టుకుని బాలుడిని చెన్నై పోలీసులకు అప్పగించారు. మంగళవారం చెన్నైలో రెండేళ్ల బాలుడిని ఉత్తరప్రదేశ్‌ అలహాబాద్‌ ప్రాంతానికి చెందిన సనికుమార్‌ కిడ్నాప్‌చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన చెన్నై పోలీసులు టెక్నాలజీ ఆధారంగా అతను నెల్లూరు రైల్వే స్టేషన్‌లో రైలు దిగినట్లు గుర్తించారు. వెంటనే తమిళనాడు పోలీసు కమిషనర్‌, జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌కు మంగళవారం రాత్రి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.


భాస్కర్‌ భూషణ్‌ హుటా హుటిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్‌లో ఆగే ప్రతి రైలును తనిఖీ చేస్తూ బస్టాండ్లు, లాడ్జీల్లో వెతుకుతూ చెన్నై పోలీసులకు  సహకారం అందించారు. చివరకు రైల్వే స్టేషన్‌ దగ్గరలో ఉన్న రాధాకృష్ణ లాడ్జీలో ముద్దాయి సనికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిని పట్టించడంలో సహకారం అందించిన నెల్లూరు ఎస్పీకి తమిళనాడు కమిషనర్‌ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్పీ నెల్లూరు నగర, రైల్వే పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2020-03-19T09:42:47+05:30 IST