మరో పాజిటివ్‌ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-18T10:14:45+05:30 IST

జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదయింది. శుక్రవారం కోవూరు మండలానికి చెందిన

మరో పాజిటివ్‌ కేసు నమోదు

64కు చేరిన ‘కరోనా’ సంఖ్య


నెల్లూరు(వైద్యం)/కోవూరు, ఏప్రిల్‌ 17 : జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదయింది. శుక్రవారం కోవూరు మండలానికి చెందిన వృద్ధుడు కరోనాకు గురయ్యారు. కోవూరు మండలం లక్ష్మీనగర్‌లో ఉంటున్న వృద్ధుడు పది రోజుల క్రితం ఒంగోలుకు వెళ్లి వచ్చారు. నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాధితుడిని కుటుండ సభ్యులు నారాయణ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉండటంతో స్వాబ్‌ను తీసి ల్యాబ్‌కు పంపగా, శుక్రవారం కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను, ఆటో డ్రైవర్‌, అందులో ప్రయాణించిన ఇద్దరు గర్భిణులను కూడా క్వారంటైన్‌ ఆసుపత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2020-04-18T10:14:45+05:30 IST