ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2020-08-22T10:38:00+05:30 IST
జిల్లాలో రెండోకారు కింద రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎంకు చెందిన రైతుసంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మి
నెల్లూరు (వైద్యం), ఆగస్టు 21 : జిల్లాలో రెండోకారు కింద రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎంకు చెందిన రైతుసంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. వారు శుక్రవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం లేకుండా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలన్నారు. మిల్లర్ల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో నేతలు శ్రీరాములు, పొట్టేపాళెం చంద్రమౌళి, జొన్నలగడ్డ వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు.