వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-12-16T05:12:38+05:30 IST

వరద బాధితులకు తక్షణ సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశంపార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఆరోపించారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
రాస్తారోకోలో టీడీపీ నాయకులు

టీడీపీ రాస్తారోకో


నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 15 : వరద బాధితులకు తక్షణ సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశంపార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఆరోపించారు. వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, నగరంలో దెబ్బదిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గాంధీబొమ్మ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్‌ మాట్లాడుతూ దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. 2012లో ఇచ్చిన జీవో ప్రకారం ఆర్థికసాయం చేస్తే కుదరదని, మానవత్వంతో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.లక్ష నగదు, తక్షణ సాయం కింద రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చేతగాని మంత్రులు, సీఎం జగన్‌ వల్లే జిల్లాకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి అనిల్‌ కళ్ళున్న కబోదిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు భూలక్ష్మి, నగర అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, తెలుగు యువత అధ్యక్షుడు నాగేంద్ర, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ఆశిష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:12:38+05:30 IST