పనబాక లక్ష్మిని గెలిపించుకొందాం

ABN , First Publish Date - 2020-11-22T03:53:33+05:30 IST

పనిచేసే లక్ష్మిగా పేరుతెచ్చుకున్న పనబాక లక్ష్మిని తిరుపతి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు.

పనబాక లక్ష్మిని గెలిపించుకొందాం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌

కోట, నవంబరు 21 :  పనిచేసే లక్ష్మిగా పేరుతెచ్చుకున్న పనబాక లక్ష్మిని తిరుపతి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు. కోటలో శనివారం టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.  పంచాయతీల వారీగా  నేతలతో సమీక్షించారు.  మండల పార్టీ కన్వీనర్‌ మద్దాలి సర్వోత్తమరెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు మధుయాదవ్‌, మైనారిటీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ జలీల్‌ అహ్మద్‌, మాజీ ఎంపీటీసీ దారా సురేష్‌, మాజీ ఎంపీపీ గుర్రం అశోక్‌, తదితరులు వున్నారు. 

టీడీపీ పరిశీలకుల నియామకం

గూడూరు(రూరల్‌): తిరుపతి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి  నియోజకవర్గంలోని మండలాలలకు టీడీపీ పరిశీలకులను నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు. గూడూరు పట్టణానికి కోవూరు నియోజకవర్గం నుంచి పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, గూడూరు మండలానికి ప్రకాశం జిల్లా యర్రగొండపాళెం నియోజకవర్గం నుంచి షేక్‌ కరీముల్లా, చిల్లకూరు మండలానికి బాపట్ల నియోజకవర్గం నుంచి తాత జయప్రకాష్‌ నారాయణ, కోట మండలానికి చీరాల నియోజకవర్గం నుంచి గొడుగుల గంగరాజు, వాకాడు మండలానికి మైదుకూరు నియోజకవర్గం నుంచి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చిట్టమూరు మండలానికి దర్శి నియోజకవర్గం నుంచి నారపుశెట్టి పాపారావులను పార్టీ పరిశీలకులుగా నియమించిందన్నారు. 


Read more