-
-
Home » Andhra Pradesh » Nellore » tdp always supports farmers
-
వైసీపీ హత్యా రాజకీయాలు
ABN , First Publish Date - 2020-12-31T03:45:11+05:30 IST
రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు.

మాజీ ఎమ్మెల్యే పాశిం
గూడూరు(రూరల్), డిసెంబరు 30: రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ఎటువంటి కార్యాచరణను విడుదల చేయలేదన్నారు. అధికార పార్టీపై సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని కడపజిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్యను ప్రణాళిక ప్రకారం హత్య చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర్లురాజు, మట్టం శ్రావణి, ఇశ్రాయిల్‌కుమార్, నరసింహులు, అమరేంద్ర, చిరంజీవి, పిళ్లెల శ్రీనివాసులు, కృష్ణయ్య, సురేష్, అల్లీహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.