-
-
Home » Andhra Pradesh » Nellore » tdp
-
రాష్ట్రంలో రాక్షస పాలన: బొల్లినేని
ABN , First Publish Date - 2020-11-26T04:06:51+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన

వింజమూరు(ఉదయగిరి రూరల్), నవంబరు 25: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వింజమూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మండల టీడీపీ నాయకులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ పనులకు రివర్స్ టెండర్ ద్వారా రూ.50 కోట్లు మిగిల్చామని గొప్పలు చెబుతోందని, వాస్తవానికి పనుల్లో కాలయాపన జరగడంతో రైతులకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని విమర్శించారు. నియోజకవర్గంలో బలహీనులపై కేసులు నమోదు చేసి రౌడీ పాలన సాగిస్తున్నారన్నారు. అస్తవ్యస్తమైన రోడ్లపై తట్టెడు మట్టి వేసిన పాపానపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పమిడి రవికుమార్‌చౌదరి, నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, రఘునాధ్‌రెడ్డి, గూడా నరసారెడ్డి, కోడూరు నాగిరెడ్డి, రామారావు, మహబూబ్‌బాషా, సుబ్బరాయుడు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.