టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2020-11-20T05:16:14+05:30 IST

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి సమక్షంలో గురువారం 19వ వార్డుకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. 19వ వార్డులోని బీరువాల ఫ్యాక్టరీ బజారుకు చెందిన టీడీపీ నేత శింగరకొండ వేణు ఆధ్వ

టీడీపీలో చేరిక

కావలి, నవంబరు 19: నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి సమక్షంలో గురువారం 19వ వార్డుకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. 19వ వార్డులోని బీరువాల ఫ్యాక్టరీ బజారుకు చెందిన టీడీపీ నేత శింగరకొండ వేణు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విష్ణువర్దన్‌రెడ్డి చేతుల మీదు గా 150 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం బత్తుల అలేఖ్య, చైతన్య, ఆదిలక్ష్మి, నాగరాజు, వెంకటలక్ష్మమ్మ, వాసంతి తదితరులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గ్రంది యానాదిశెట్టి, జ్యోతి బాబూరావు, పద్మనాభరెడ్డి, శానం హరి, దామా మాల్యాద్రి, వెంగళరెడ్డి, కర్నాటి సుబ్బారావు, జ్వాలా చంద్రశేఖర్‌, కోటా రమేష్‌, మస్తాన్‌రెడ్డి, అప్పల కల్యాణచక్రవర్తి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T05:16:14+05:30 IST