మహానటుడు జగన్‌రెడ్డి!

ABN , First Publish Date - 2020-11-20T02:12:56+05:30 IST

యువజనులు, శ్రామికులు, రైతుల పేర్లను వైఎస్‌ఆర్సీపీగా పెట్టి ప్రజలను మోసం చేసిన మహానటుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని తెలుగుదేశంపార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు.

మహానటుడు జగన్‌రెడ్డి!
టీడీపీలో చేరిన వారితో అజీజ్‌, కోటంరెడ్డి

ఆయన మోసాలను ప్రజలు గమనిస్తున్నారు!

టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అజీజ్‌

33 కుటుంబాలు పార్టీలో చేరిక


నెల్లూరు (వ్యవసాయం), నవంబరు 19 : యువజనులు, శ్రామికులు, రైతుల పేర్లను వైఎస్‌ఆర్సీపీగా పెట్టి ప్రజలను మోసం చేసిన మహానటుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని తెలుగుదేశంపార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు. నెల్లూరు రూరల్‌ నియోజవకర్గంలోని పాతవెల్లంటి గ్రామానికి చెందిన వైసీపీ, జనసేన పార్టీలకు చెందిన 33 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అజీజ్‌ మాట్లాడుతూ పేదల కడుపు కొట్టడం, కార్మికుల పొట్ట కొట్టడం, రైతులను రోడ్డుమీదకు తీసుకుని రావడమన్నీ ప్రజలు చూస్తున్నారని అన్నారు. వలంటీరు ఉద్యోగం దేనికి పనికిరాదని ఒక్కసారి వారింటికెళ్లి చూస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. మొలకెత్తిన రాజధానిని దున్నపోతులు, ఆంబోతులు తొక్కేసినట్లు తొక్కేశారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయం చేసుంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడని, ఆయన ఏరోజు రాజకీయం చేయలేదని ప్రజల కోసమే శ్రమించారని అన్నారు. నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అజీజ్‌ నాయకత్వంలో పార్టీలో ఎంతో మంది చేరుతున్నారని, రాబోయే కాలంలో జిల్లావ్యాప్తంగా ఇలాంటి చేరికలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెన్ని రమణయ్య, పమజుల ప్రదీప్‌, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ఖాన్‌, రేవతి, కప్పిర శ్రీనివాసులు, నన్నేసాహెబ్‌, వెంకటేశ్వర్లు, రత్నం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T02:12:56+05:30 IST