ఏపీ నరకాసురుడు జగన్‌!

ABN , First Publish Date - 2020-11-14T05:16:17+05:30 IST

ఆంధ్రుల పాలిట మరో నరకాసురుడిలా జగన్‌రెడ్డి పుట్టుకొచ్చారని, ఆయన పాలనలో రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడిందని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు.

ఏపీ నరకాసురుడు జగన్‌!
జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

ఆయన పాలనలో రాష్ట్రం అంధకారంలోకి..

టీడీపీ కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మ దహనం


నెల్లూరు (వ్యవసాయం), నవంబరు 13 : 

ఆంధ్రుల పాలిట మరో నరకాసురుడిలా జగన్‌రెడ్డి పుట్టుకొచ్చారని, ఆయన పాలనలో రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడిందని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు. నరక చతుర్దశి సందర్భంగా శుక్రవారం సాయంత్రం తెలుగుయువత నెల్లూరు పార్లమెంటు కోఆర్డినేటర్‌ కాకర్ల తిరుమలనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం ఎదుట జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అజీజ్‌ మాట్లాడుతూ జగన్‌ అధికారం చేపట్టాక సంక్షేమ పథకాల్లో కోత, ఎన్టీఆర్‌ గృహాల పంపిణీ అడ్డగింపు, ధరలు, పన్నులు పెంపుదల, ఇసుక దోపిడీ, అక్రమకేసుల బనాయింపు, విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మకాలు, పేకాటక్లబ్బులు దళిత, మైనార్టీ వర్గాలపై దాడులు, కక్షసాధింపులు, హత్యలు వంటివి సర్వసాధారణమయ్యాయని విమర్శించారు. పార్టీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నరకాసురుడు సైతం ఈర్ష్యపడేలా జగన్‌ పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర నరకాసురుడు జగన్‌ చెరనుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వైసీపీ అంతమైన రోజే ప్రజలకు నిజమైన దీపావళి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, ధర్మవరపు సుబ్బారావు, భూలక్ష్మి, రేవతి, విజయమ్మ, నిర్మల, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, సతీష్‌, శాంతినాయుడు, అమృల్లా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-14T05:16:17+05:30 IST